లాక్‌డౌన్‌తో మెరుగైన గంగా నది నీటి నాణ్యత

వారణాసి : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు భారత్‌లో 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. పరిశ్రమల బంద్‌ కారణంగా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు నిలిచిపోయాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న నదిలోకి వెళ్లి కలుస్తుంటాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలన్నీ మూసివేయడంతో వారణాసి, హరిద్వార్‌ ప్రాంతాల్లో ప్రవహించే గంగా నదిలోకి వ్యర్థాలు చేరకపోవడంతో నదిలోని నీరు రోజు రోజుకి శుద్ధి అవుతోంది.  అనేక పరిశోధనల అనంతరం ప్రస్తుతం నీటి నాణ్యతలో గొప్ప మార్పు కనిపిస్తోందని, అలాగే తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. (బ్రిటన్‌ కమెడియన్‌ కన్నుమూత)