విందు: ట్రంప్‌ మెనూలోని వంటకాలివే!

న్యూఢిల్లీ: తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘనమైన విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న విందులో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. అదే విధంగా ట్రంప్‌ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలు తయారుచేసినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాల సమాచారం. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్‌ బౌజ్‌ సర్వ్‌ చేసిన తర్వాత.. సాలమన్‌ ఫిష్‌ టిక్కాతో ఈ గ్రాండ్‌ డిన్నర్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వెజిటేరియన్‌ ఫుడ్‌లో భాగంగా... రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్‌ చాట్‌ తదితర వంటకాలను ట్రంప్‌ కుటుంబానికి వడ్డించనున్నారు. (ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్‌)